మంత్రివర్గంలో హరీష్ రావుకు చోటు

SMTV Desk 2019-09-08 12:30:46  harish rao, kcr,

హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేయాలని సిఎస్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. తమిళసై సౌందరరాజన్‌కు సిఎం కెసిఆర్ మంత్రివర్గ విస్తరణ సమాచారాన్ని ఇచ్చారు. నూతన మంత్రులుగా కెటిఆర్, హరీశ్‌రావు, సబిత ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో కెసిఆర్‌ను మంత్రి ఈటెల రాజేందర్, హరీష్ రావు, పువ్వాడ కలిశారు. సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.