'చంద్రయాన్-2' పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

SMTV Desk 2019-09-07 16:13:38  

దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రయాన్-2 ప్రాజెక్టు చేపట్టారంటూ కేంద్రంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. చంద్రయాన్-2 ప్రాజెక్టును తక్కువ చేసి మాట్లాడుతున్న వాళ్లు దేశ ప్రయోజనాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని దీదీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-2 చంద్రుడిపై దిగే అద్భుత క్షణాల్లో ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి అభినందించకుండా ఎలా ఉంటారు? ప్రతికూల వాదంతో ఆలోచించే వారు ఎలాగైనా మాట్లాడతారు అంటూ విమర్శించారు.