ఆ పార్టీ కార్యకర్తలంతా వ్యభిచారులే!!

SMTV Desk 2019-08-31 13:05:35  

జేడీఎస్ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ కార్యకర్తలను వ్యభిచారులతో పోల్చి కొత్త వివాదానికి తెరలేపారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని జేడీఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నపై ఆయన స్పందిస్తూ... జేడీఎస్ కార్యకర్తలంతా వ్యభిచారులేనని అన్నారు. డ్యాన్స్ రాని వ్యభిచారి... డ్యాన్స్ చేయడానికి వేదిక అనుకూలంగా లేదని చెబుతుందని... అదే విధంగా తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి జేడీఎస్ కార్యకర్తలు తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత నెలలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే.