'బాహుబలి 2' రికార్డులు బ్రేక్

SMTV Desk 2019-08-31 13:03:51  

ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన సాహో నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. నైజామ్ ఏరియాలో ఈ సినిమా తొలిరోజున రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. తొలిరోజున నైజామ్ లో ఈ సినిమా 9.41 కోట్ల షేర్ ను సాధించింది. గతంలో బాహుబలి 2 రాబట్టిన తొలి రోజు వసూళ్ల కంటే ఇది ఎక్కువ.

ఇక నెల్లూరులోను ఈ సినిమా తొలి రోజున బాహుబలి 2 కంటే ఎక్కువ (2.56 కోట్లు) వసూలు చేసింది. ఈ రెండు ఏరియాల్లో తొలిరోజు వసూళ్ల విషయంలో బాహుబలి 2 రికార్డులను సాహో అధిగమించడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజునే 35.66 కోట్ల షేర్ ను వసూలు చేసింది. బాహుబలి 2 సంచలన విజయం తరువాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా కావడం వల్లనే సాహో కి ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.