రూటు మార్చేసిన రామ్

SMTV Desk 2019-08-31 13:02:23  

రామ్ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన ఇస్మార్ట్ శంకర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ హిట్ తో వచ్చిన క్రేజ్ ను కాపాడుకునే ప్రయత్నాల్లో రామ్ వున్నాడు. ఈ సినిమాకి ముందు ఓకే అనుకున్న కథలను .. ప్రాజెక్టులను కూడా ఆయన రద్దు చేసుకుంటున్నాడట. కథాకథనాల్లో కొత్తదనం ఉంటేనే అంగీకరించాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడని అంటున్నారు.

ఇస్మార్ట్ శంకర్ సినిమా సీక్వెల్లో చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఈ సీక్వెల్ కి డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ను కూడా పూరి ఖాయం చేయడంతో, ఈ ప్రచారం మరింత జోరందుకుంది. అయితే రామ్ మాత్రం ఒక లవ్ స్టోరీ .. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసిన తరువాతనే డబుల్ ఇస్మార్ట్ చేయాలనుకుంటున్నాడనేది తాజా సమాచారం. మాస్ హీరో అనే ముద్ర నుంచి తప్పించుకోవడానికే ఆయన ఇలా ప్లాన్ చేసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు.