సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని దారుణ హత్య

SMTV Desk 2019-08-30 12:45:02  

హైదరాబాదులో సతీష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన సతీష్... ఐటీ స్లెట్ సొల్యూషన్స్ అనే కంపెనీని స్థాపించాడు. తనతో పాటు హేమంత్ అనే వ్యక్తిని పార్టనర్ గా పెట్టుకున్నాడు. కూకట్ పల్లి పరిధిలో ఉన్న మూసాపేట్ లో సతీష్ నివాసం ఉంటున్నాడు. నిన్న రాత్రి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో... ఆయన భార్య కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఈ క్రమంలో, తన బిజినెస్ పార్టనర్ హేమంత్ ఇంట్లో సతీష్ మృతదేహం లభ్యమైంది. దీంతో హేమంతే సతీష్ గొంతు నులిమి హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హేమంత్ నే నిందితుడిగా భావిస్తూ... పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.