110 సంవత్సరాలు బతుకుతా

SMTV Desk 2019-08-28 14:30:04  

భారత్ లో ఆశ్రయం పొందుతున్న టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా ప్రస్తుతం అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. అయితే, తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను 110 సంవత్సరాలు బతుకుతానని భక్తులను ఉద్దేశించి ఓ వీడియోలో సందేశం వెలువరించారు. ధర్మరక్షక దేవతగా ప్రసిద్ధి చెందిన పాల్ డెన్ లామో కలలో కనిపించిందని, తన జీవితకాలం ఎంతో చెప్పిందని దలైలామా పేర్కొన్నారు. తాను 110 ఏళ్లు జీవిస్తానని చెప్పిందని, తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని సూచించారు. ప్రస్తుతం దలైలామా వయసు 84 సంవత్సరాలు. భారత్ లోని ధర్మశాల నుంచి టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. కాగా, దలైలామా వీడియో పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.