సింధు బయోపిక్ వార్తలపై గోపీచంద్ స్పందన

SMTV Desk 2019-08-28 14:27:52  

పీవీ సింధు బాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్స్ షిప్ లో స్వర్ణపతకం సాధించింది. దీంతో ఆమెను సెలెబ్రిటీలు అభినందనలతో ముంచెత్తారు. సింధు స్వర్ణం గెలిచిన వెంటనే ఆమె బయోపిక్ సినిమా గురించి టాక్ వచ్చింది. పీవీ సింధు జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నారని, అందులో కోచ్ గోపీచంద్ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై గోపీచంద్ స్పందించారు. అక్షయ్ కుమార్ తనకు ఇష్టమైన నటుడు అని.. తాను ఇష్టపడే నటుడు తన పాత్రలో నటిస్తే అంతకంటే కావాల్సింది ఏముందని అన్నారు. పీవీ సింధు సినిమా గురించి ఇంకా తనకు తెలియదని అన్నారు. పీవీ సింధు 2013, 2014లో కాంస్యం, 2017,2018 లో రజత పతకాలను గెలుచుకుంది. కాగా, ఈ ఏడాది సింధు ఫైనల్ లో జపాన్ క్రీడాకారిణిని ఓడించి స్వర్ణపతకం గెలుచుకుంది.