డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త చిక్కులు ..కెనడా ప్రధానిపై కన్నేసిన మెలానియా ట్రంప్..!?

SMTV Desk 2019-08-28 14:27:17  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయంటున్నారు నెటిజన్లు..! ఏ విషయంలోనైనా దూకుడుగా ఉండే ట్రంప్.. ఇక అమ్మాయిలు, ఆంటీలు కనబడితే మరో అడుగు ముందుకేసి.. కుదిరితే హగ్..! లేకపోతే కిస్ అనే రేంజ్‌లో ఉంటారు. ఇప్పుడు ట్రంప్‌కు షాక్ ఇచ్చింది ఆయన భార్య మెలానియా ట్రంప్‌. ఏకంగా ఆయన ముందే కెనడా ప్రధానిని ముద్దు పెట్టుకుంది. దీంతో ట్రంప్ తన కిందకు దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫ్రాన్స్‌లోని బియార్రిట్జ్‌లో జరుగుతున్న జీ 7 సదస్సుకు ఆయా దేశాల అధినేతలు పలువురు వారి జీవిత భాగస్వాములతో హాజరయ్యారు. ఇందులో భాగంగా దేశాధినేతల కుటుంబాలు ఒక్కచోట చేరి ఫొటోలకు ఫోజులిచ్చాయి. ఈ సందర్భంగా అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌.. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోల ఫొటోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో రోజులుగా మెలానియా చూపు ట్రూడోపై ఉందని... చాలా మంది అమ్మాయిల్లాగే ఆమె కూడా కెనడా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ మెలానియాలవ్స్‌ట్రూడో అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.
ఈ ఫొటో షూట్ సందర్భంగా తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెకరానో భార్య బ్రిగిట్‌కి ముద్దు పెట్టుకోగా.. ఆ వెంటనే ట్రంప్‌ చర్యకి.. ప్రతి చర్యలా.. తానేం తక్కువ అనే రేంజ్‌లో వెంటనే మెలానియా ట్రంప్ తన పక్కనే ఉన్న కెనాడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోని కిస్ చేసింది. ఇక అదే సమయంలో పక్కనే ఉన్న ట్రంప్‌ కళ్లు కిందకు వాల్చుకున్నట్లుగా ఉన్న ఫొటోను రాయిటర్స్‌ షేర్‌ చేసింది. మెలానియా ట్రంప్‌.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడోను ముద్దాడారు. అప్పుడు ట్రంప్‌ కిందకు చూస్తుండిపోయారంటూ జీ 7 సదస్సు ఫొటోలను పోస్ట్‌ చేసింది. దీంతో మెలానియా-ట్రూడో-ట్రంప్‌ల ఫొటోపై స్పందించిన నెటిజన్లు... ట్రంప్‌నకు పెద్ద చిక్కే వచ్చిపడింది. మెలానియా రిస్క్‌ చేయడానికి వెనుకాడటం లేదంటూ కామెంట్‌ చేస్తున్నారు.