5 లక్షలిస్తే డైరెక్ట్‌ జాబే!!

SMTV Desk 2019-08-28 14:24:42  

‘మంత్రి పెద్దిరెడ్డి మావోడే. ఎంపీ మిథున్‌ రెడ్డీ మా బంధువే. ఐదు లక్షలిస్తే డైరెక్టుగా సచివాలయ సెక్రటరీ పోస్ట్‌ ఇప్పిస్తా’’ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారానికి దిగి, ఉద్యోగార్థులను మోసం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం చిత్తూరు నగర డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. కడప జిల్లా పులివెందుల మున్సిపల్‌ ఆఫీసులో పనిచేస్తున్న పోరుమామిళ్ల రమేశ్‌బాబు.. రూ.5 లక్షలు ఇస్తే పంచాయతీ కార్యదర్శి పోస్టు ఇప్పిస్తానని ఇదే జిల్లాకు చెందిన అమ్మద్‌ అనే వ్యక్తిని ఫోన్‌లో నమ్మించాడు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలోనూ ఇదే తరహా ప్రచారానికి తెరదీశాడు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రమేశ్‌బాబును అరెస్టు చేశారు. విచారణలో ఆయన నేరం అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు.