పెట్రోల్, డీజిల్ ధరలు

SMTV Desk 2019-08-27 11:52:12  

దేశీ ఇంధన ధరలు స్థిరంగా కొనసాగాయి. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.59 వద్ద, డీజిల్ ధర రూ.71.21 వద్ద నిలకడగా కొనసాగింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.76.32 వద్దనే ఉంది. డీజిల్‌ ధర కూడా స్థిరంగా రూ.70.62 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.75.95 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ రూ.70.28 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.72.07 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.65.35 వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర నిలకడగా రూ.77.73 వద్ద ఉంటే.. డీజిల్ ధర రూ.68.51 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.55 శాతం పెరుగుదలతో 58.44 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.58 శాతం పెరుగుదలతో 53.95 డాలర్లకు ఎగసింది.