అగ్రరాజ్యాలకు పాక్ ప్రధాని ఘాటు హెచ్చరికలు

SMTV Desk 2019-08-27 11:48:06  

కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న పాకిస్థాన్ బెదిరింపు ధోరణి కనబరుస్తోంది. తాజాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ అగ్రరాజ్యాలకు హెచ్చరికలు జారీచేశారు. "గుర్తుంచుకోండి, ఈ వివాదం యుద్ధానికి దారి తీస్తే మాత్రం ఆ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. రెండు దేశాలు అణ్వాయుధ సహిత దేశాలే. అణుయుద్ధంలో విజేత అంటూ ఎవరూ ఉండరు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ అగ్రరాజ్యాలపై పెను బాధ్యత ఉంది. ఒకవేళ అగ్రరాజ్యాలు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, పాకిస్థాన్ ఎంత దూరమైనా వెళుతుంది" అంటూ బెదిరింపు గళం వినిపించారు.