రేపు ఒకే రోజు 11 సినిమాలు రిలీజ్

SMTV Desk 2019-08-23 10:45:42  

ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాలు అసలే కాదు.. రేపు ఒకే రోజు టాలీవుడ్‌కు చెందిన 11 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సాధారణంగా వారానికి ఒకటో, రెండో సినిమాలు థియేటర్లలోకి వస్తుంటాయి. మరీ చిన్న సినిమాలు ఓ మూడు, నాలుగు వరకు వచ్చేస్తుంటాయి. కానీ, ఈ వారం మాత్రం ఏకంగా 11 సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే ఐశ్వర్య రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషించిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ ఇందులో చెప్పుకో దగిన సినిమా కాగా.. అమర్ విశ్వరాజ్ దర్శకత్వం వహించిన బోయ్ , జాని దర్శక, నిర్మాతగా తెరకెక్కించిన నేనే కేడీ నెం.1 , మహేష్ దర్శకత్వం వహించిన జిందాగ్యాంగ్ , ఇక.. ఏదైనా జరగొచ్చు , ఉండిపోరాదే , నివాసి , పండుగాడి ఫోటో స్టూడియో , అశ్వమేథం