రోహిత్‌కు నో చాన్స్...కోహ్లీ ప్రమేయం ఉందా!!

SMTV Desk 2019-08-23 10:44:53  

టీమిండియా-విండీస్ మధ్య తొలి టెస్టుకు వర్షం వల్ల అరగంట ఆలస్యంగా టాస్‌ పడింది. ఈ నేపథ్యంలో విండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు విండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ పేర్కొన్నాడు. మరోవైపు మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ జంట ఓపెనింగ్‌ చేస్తారని కెప్టెన్‌ కోహ్లీ చెప్పాడు. అలాగే సాహా, రోహిత్‌శర్మ, అశ్విన్‌, కుల్‌దీప్‌, ఉమేశ్‌యాదవ్‌ తుది జట్టులో లేరని స్పష్టం చేశాడు. అయితే ఈ తుది జట్టులో రోహిత్ ను ఎంచుకుంటారు అని అభిమానులతో సహా మాజీలు కూడా అభిప్రయాపడ్డారు. కాని ఊహించని విధంగా రోహిత్ ను పక్కన బెట్టి హనుమ విహారిణి ఎంపిక చేయడంతో అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. గంగూలీ, షోయబ్ అక్తర్, సెహ్వాగ్ లు ఇదివరకే రోహిత్ ను ఎంపిక చేయాలనీ కోహ్లీకి సూచించిన కూడా తుది జట్టులో రోహిత్ ను తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వెల్లడవుతున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మాత్రం రోహిత్ ను ఎంపిక చేయక పోవడం వెనుక కోహ్లీ-రోహిత్ మధ్య ఉన్న అంతర్గత విభేదాలే కారణమని, అలాగే ఇందులో కోహ్లీ హస్తం కూడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారత జట్టు: మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్యా రహానె, హనుమ విహారి, రిషభ్‌పంత్‌, రవీంద్ర జడేజా, ఇషాంత్‌ శర్మ, మహ్మద షమి, జస్ప్రిత్‌ బుమ్రా .