టిడిపి అగ్రనేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూత

SMTV Desk 2019-08-21 13:19:49  

కడప : టిడిపి అగ్రనేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బుధవారం ఉదయం బ్రహ్మయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే చనిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రహ్మయ్యకు మొదటిసారి గుండెపోటు వచ్చింది. అప్పుడు అమరావతిలోని రమేశ్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుని కోలుకున్నారు. 1994లో ఆయన రాజంపేట నుంచి టిడిపి ఎంఎల్ఎగా గెలుపొందారు. ఉమ్మడి ఎపిలో ఆయన ఎపి ఖాదీ బోర్డు చైర్మన్ గా కూడా పని చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో బ్రహ్మయ్య చిన్న తరహా పరిశ్రమలు, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన పని చేశారు. 2004 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన టిడిపి నుంచి టికెట్ ఆశించినప్పటికీ రాలేదు. బ్రహ్మయ్య మృతిపై టిడిపి చీఫ్ చంద్రబాబు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.