ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కోసం ఇడి లుకవుట్ నోటీసు

SMTV Desk 2019-08-21 13:18:43  

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ముందస్తు జామీను కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించి విఫలమైన మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం లుక్ ఔట్ నోటీసు జారీ చేసింది. మంగళవారం సిబిఐ అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన తర్వాత కనిపించకుండా పోయిన చిదంబరం తరఫున ఆయన న్యాయవాదులు బుధవారం సుప్రీంకోర్టులో ముందస్తు జామీను కోసం పిటిషన్ దాఖలు చేయగా అత్యవసర విచారణ నిమిత్తం దీన్ని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు జస్టిస్ ఎన్‌వి రమణ నివేదించారు. మంగళవారం రాత్రి చిదంబరం నివాసానికి చేరుకున్న సిబిఐ, ఇడి అధికారులు ఆయన ఇంట్లో లేకపోవడంతో రెండు గంటల్లో తమ ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసు అంటించారు.