బెంగుళూరులో దారుణం .. లవర్ తో కలిసి కన్నతండ్రిని చంపిన కూతురు ..

SMTV Desk 2019-08-20 11:37:40  

బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరు ఓ కూతురు తన తండ్రిని బాయ్ ఫ్రెండ్‌తో కలిసి చంపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జై కుమార్ (41) అనే వ్యక్తి వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జై కుమార్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నాడు. జై కుమార్తె పదో తరగతి చదువుతోంది. దీంతో ఆయన కుమార్తె ఒక రోజు బాయ్ ఫ్రెండ్ తో కనిపించడంతో జై గమనించి పలుమార్లు ఆమెను మందలించాడు. కానీ అమ్మాయి మాత్రం తన లవర్‌తోనే తిరగడంతో ఇంట్లో తండ్రికి ఆమెకు పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో కూతురు తన తండ్రిని చంపాలని నిర్ణయం తీసుకుంది. ఒక రోజు తన తల్లి, సోదరుడు బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన కూతురు తన తండ్రిని చంపాలని లవర్‌కు సూచించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తండ్రికి పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. నిద్రలోకి జారుకున్న తండ్రిని తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కడుపులో కత్తి పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహానికి నిప్పు పెట్టారు. చుట్టు పక్కల వారికి ఇంట్లో నుంచి పొగవాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జై కుమార్ కూతురును ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అమ్మాయిని, ఆమె లవర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.