అల్లుడిని చంపిన అత్త -మామలు

SMTV Desk 2019-08-20 11:35:38  

పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చందపల్లి లో సయ్యద్ సలీం (38) అనే ఆటోడ్రైవర్‌ను అతని భార్య ఆస్రా బేగం, మృతుని అత్త, మామ, మరో ఇద్దరు కలిసి కట్టెలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. గోదావరిఖని పరిధి ఎల్కలపల్లికి చెందిన సలీంకు చందపల్లికి చెందిన నిందితురాలితో పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు కొడుకులు, మృతుడు సలీం రామగుండం ఎన్టీపీసీ పరిధిలోని ఎల్కలపల్లిలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా భార్య భర్తల నడుమ కలహాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నింధితురాలు పెద్దపల్లి పరిధి చందపల్లిలోని తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.

గత కొంత కాలంగా పెద్దపల్లిలోనే ఉంటుండడంతో సలీం తరుచూ తాగి వచ్చి గొడవ చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సలీం మద్యం సేవించి నింధితురాలి ఇంటికి చేరుకొని దురుసుగా ప్రవర్తించడంతో మృతుడి భార్యతో కలిసి ఆమె తల్లి, తండ్రి ఇతర బంధువులు కట్టెలతో తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే సలీం మృతి చెందాడు. సలీం మృతి చెందిన విషయాన్ని ఉదయం వరకు ఎవరికీ చెప్పకుండా ఉదయం 9గంటలకు మృతుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కొడుకు చనిపోయాడు అని చెప్పడంతో మృతుడి తల్లిదండ్రులు పెద్దపల్లికి చేరుకొని సంఘటన స్థలం గమనించిన ఆనంతరం అనుమానంతో వెంటనే పెద్దపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెద్లపల్లి డిసిపి సుదర్శన్‌గౌడ్, ఎసిపి వెంకటరమణారెడ్డి, సిఐ నరేందర్‌లు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించి మృతుని భార్య ఆస్రాబేగం, అత్త సుల్తానా, మామ గౌస్ ఖాన్, కాలనీకి చెందిన మహ్మద్ గౌస్, మహ్మద్ జాఫర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.