పారామిలిటరీ సిబ్బందికి శుభవార్త

SMTV Desk 2019-08-20 11:33:08  

న్యూఢిల్లీ: పారామిలిటరీ సిబ్బందికి కేంద్రం తీపికబురు అందించింది. బలగాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారి వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్, ఏఆర్ విభాగాల్లోని బలగాలకు ఈ నిబంధనలు వర్తింపజేసేలా హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పారామిలిటరీ బలగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఒకే రకమైన నిబంధనలు పాటించాలంటూ ఈ ఏడాది జులై 31న ఢిల్లీ హైకోర్టు చేసిన సూచన మేరకు కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని హోం శాఖ స్పష్టం చేసింది.