బాలకృష్ణ నయా లుక్ వైరల్

SMTV Desk 2019-08-20 11:32:07  

నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ బయోపిక్ తర్వాత బోయపాటి శ్రీను ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మూవీ స్టోరీ పూర్తి స్థాయిలో రెడీ కాకపోవడంతో ముందుగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తర్వాతి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసాడు. అంతేకాదు పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ బ్యాంకాక్‌లో ప్రారంభమైంది. అది కూడా రెండు పాటలతో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ నుంచి ఎలా గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేదే ఈ మూవీ స్టోరీ. ఫుల్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియండెట్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో బాలయ్య మరోసారి డ్యుయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో బాలకృష్ణ సరసన లెజెండ్ భామ సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నమిత మరోముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమచారం. తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రకు సంబంధించిన కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ లుక్‌లో ఫ్రెంచ్ గడ్డంతో ఇప్పటి వరకు చూడని సరికొత్త లుక్‌తో కనిపించి ఫ్యాన్స్‌ అవాక్కయ్యేలా చేసాడు బాలయ్య. ఈ లుక్‌లో బాలకృష్ణను చూస్తుంటే.. ముప్పై యేళ్లు యువకుడిలా కనిపిస్తున్నాడు. కే.యస్.రవికుమార్ సినిమా కోసం బాలయ్య బాగానే తగ్గినట్టు కనిపిస్తుంది. ఏమైనా కొత్త లుక్‌లో బాలయ్యను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్రలో జగపతి బాబు యాక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో జగపతి బాబు కూడా తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభియం చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా సంక్రాంతికి లేదా సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ దాదాపు ఖరారైంది. మరోవైపు ‘క్రాంతి’ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికి నందమూరి నాయకుడు బాలయ్య సరికొత్త గెటప్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.