ఆరెంజ్ బికినీలో అనుష్క… కోహ్లి రియాక్షన్ వైరల్

SMTV Desk 2019-08-20 11:31:29  

బాలీవుడ్‌ అందాల భామ అనుష్క శర్మ సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ఎప్పటికప్పుడు తన భర్త క్రికెటర్‌ విరాట్‌ కోహ్లితో దిగిన ఫోటోలను, తన ఫోటోలను అభిమానుల కోసం ఇస్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తారు. కోహ్లితో వివాహం అనంతరం అందాల ఆరబోతకు అనుష్క దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా భర్త విరాట్‌తో ఇటీవల వెస్టిండీస్‌కు వెళ్లిన అనుష్క ఓ బీచ్‌లో బికినితో దిగిన ఫోటోను ఇస్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘సూర్యుడు ముద్దు పెట్టుకొని.. ఆశీర్వదించాడు’ అనే ట్యాగ్‌ లైన్‌ జోడించారు. అయితే అనుష్క పెట్టిన బికిని ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆరెంజ్ మరియు వైట్ కలర్‌లో చారల బికినీలో బీచ్ దగ్గర కూర్చున్న అనుష్క చాలా బాగుందంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ ఫోటోపై స్పందించిన విరాట్‌ ‘హృదయం, లవ్‌ స్ట్రక్‌ ఎమోజీల’ తో కూడిన కామెంట్‌ చేశాడు. దీనికంటే ముందు విరాట్‌ ‘క్రికెట్‌ కెరీర్‌ 2008లో ప్రారంభమై నేటికి( 2019) 11 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. ‘దేవుడి దీవెనలు నాపై ఉంటాయని ఊహించలేదు. మీ కలలు నిజం చేసుకోవడానికి ఎల్లప్పుడూ మీకు సరైన శక్తి, సామర్థ్యాలు లభిస్తాయి’ అంటూ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నాటి ఫోటోను కోహ్లి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అనుష్క చివరగా షారుక్‌ఖాన్‌ హీరోగా నటించిన’ జీరో’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాను ఎటువంటి కొత్త సినిమాపై సంతకం చేయలేదు.