జెడియు నాయకుడు జగన్నాథ్ మిశ్రా కన్నుమూత

SMTV Desk 2019-08-19 14:26:36  

న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జెడియు నాయకుడు జగన్నాథ్ మిశ్రా సోమవారం ఉదయం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 82 సంవత్సరాల మిశ్రా మూడుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీహార్ రాజకీయాలలోకి ఆర్‌జెడి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రవేశించడానికి ముందు జగన్నాథ్ మిశ్రా ఆ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. మిశ్రా మృతికి బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ సంతాపం ప్రకటించారు. మిశ్రా మృతికి మూడు రోజుల సంతాపాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో మిశ్రాకు అంత్యక్రియలు జరుగుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.