మహాత్ముడి ఆలయం...

SMTV Desk 2019-08-18 14:17:59  

మహాత్మాగాంధీకి ఓ రాష్ట్రంలో ఏకంగా గుడే కట్టేశారు. అంతేకాదు.. ఆయనకు రోజూ పూజలు అర్పిస్తూ దేవుడిగా కొలుస్తున్నారు. మంగళూరులోని గరోది ప్రాంతంలోని శ్రీ బ్రమ్హా బైదర్కళాక్షేత్ర ఆలయంలోని ఈ గాంధీ మందిరం ఉంది. శాంతి, అహింసకు ప్రతిరూపంగా భక్తులు మహాత్ముడిని పూజిస్తున్నారు. భక్తులు రోజూ గాంధీ విగ్రహం వద్ద టీ, కాఫీ, అరటి పండ్లు ఉంచి ప్రార్థనలు చేస్తారు. 1948లో ఈ మందిరం నిర్మించగా 2006 విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. గాంధీజీ భక్తుడు ప్రకాష్ గరోడీ రోజు తెల్లవారుజామున మందిరం పరిసరాలను శుభ్రం చేస్తారు. మహాత్మా గాంధీ తన జీవితంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని, అందుకే మందిరం పరిసరాలను శుభ్రం చేస్తుంటానని ప్రకాష్ తెలిపాడు. అలాగే 2014లో మహాత్మాగాంధీ 149వ జయంతి వేడుకలను పురస్కరించుకుని నల్గొండ జిల్లా చిట్యాల వద్ద గాంధీ ఆలయాన్ని నిర్మించారు. నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గుడిలో రెండు అంతస్తులు ఉంటాయి. ప్రధాన ఆలయంలో పైఅంతస్తులో ఉంటుంది. కింది అంతస్తులో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద భక్తులు ధ్యానం చేస్తుంటారు. ఈ గుడిలో గాంధీజీ జీవిత విశేషాలతో ప్రత్యేక గ్రంథాలయం కూడా ఉంది.