ఆలయ విస్తరణ పనులను పరిశీలిస్తున్న కెసిఆర్

SMTV Desk 2019-08-17 16:33:48  

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు యాదాద్రికి చేరుకున్నారు. సిఎం కెసిఆర్‌కు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. బాలాలయంలో కెసిఆర్ ప్రత్యేక పూజలు చేశారు. కెసిఆర్ కు అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశి ఆశీర్వదించారు. అనంతరం యాద్రాద్రి రింగ్ రోడ్డు పనులను సిఎం పరిశీలించనున్నారు. రూ.143 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు చుట్టూ 5.2 కిలో మీటర్ల మేర రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయ విస్తరణ పనులను కెసిఆర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సిఎం సమీక్ష నిర్వహిస్తారు. మహాసుదర్శన నారసింహయాగం నిర్వహణపై అధికారులతో చర్చలు జరపనున్నారు.