డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు

SMTV Desk 2019-08-14 18:10:42  

ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంక్ ఐసిఐసిఐ తన కస్టమ్లకు షాక్ ఇచ్చింది. తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తన్నట్లు ప్రకటించింది. కాగా ఈ నిర్ణయం నేటి నుంచి అమలులోకి వచ్చింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేద్దామని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్. వారికి ఇకపై తక్కువ వడ్డీ లభిస్తుంది. 30-45 రోజులు, 46-60 రోజులు, ఏడాది-389 రోజుల కాలపరిమితుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ సాధారణ డిపాజిట్లకు 5.25 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్స్‌కు 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది 30-45 రోజుల డిపాజిట్లకు వర్తిస్తుంది. ఏడాది నుంచి 389 రోజుల మెచ్యురిటీ డిపాజిట్లపై బ్యాంక్ 20 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. రేట్ల తగ్గింపు తర్వాత ఈ డిపాజిట్లపై ఇప్పుడు 6.7 - 7.2 శాతం వడ్డీ రేటు పొందొచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన మానిటరీ పాలసీ సమావేశంలో కీలక రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది.