10 మంది ఎస్ డిఎఫ్ ఎంఎల్ఎలు బిజెపిలో

SMTV Desk 2019-08-13 17:15:24  

ఢిల్లీ : సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఎస్‌డిఎఫ్‌)కు చెందిన 10 మంది ఎంఎల్ఎలు మంగళవారం బిజెపిలో చేరారు. బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా, ఆ పార్టీ అధికార ప్రతినిధి రామ్‌మాధవ్‌ సమక్షంలో వీరు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. 10 మంది ఎస్ డిఎఫ్ ఎంఎల్ఎలు బిజెపిలో చేరడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్ డిఎఫ్ 15 స్థానాల్లో గెలుపొందింది. సిక్కిం క్రాంతికరి మోర్చా (ఎస్ కెఎం) 17 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో సిక్కింలో ఎస్ డిఎఫ్ అధికారాన్ని కోల్పోయింది. సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎస్ డిఎఫ్ కు చెందిన 10 మంది ఎంఎల్ఎలు బిజెపిలో చేరడంతో పార్టీ సంఖ్యాబలం 5కు పడిపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎస్ కెఎం ఎన్ డిఎ భాగస్వామ్య పక్షమన్న విషయం తెలిసిందే.