ఆర్టికల్ 370 రద్దు... సుప్రీంకోర్టు తీర్పు

SMTV Desk 2019-08-13 17:14:09  

ఢిల్లీ : జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రానికి ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. అయితే జమ్మూకశ్మీర్ విభజనపై కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం కశ్మీర్ ప్రజలు పోలీసు పహారాలో జీవనం సాగిస్తున్నారు.