వరంగల్ లో దారణం ...మద్యం మత్తులో పసికందును వదిలేసిన మహిళ

SMTV Desk 2019-08-13 17:05:09  

వరంగల్ : వరంగల్ లో దారణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ మహిళ పసికందును బస్టాండ్ సమీపంలో వదిలేసింది. బస్టాండ్ లోని ప్రయాణికులు శిశువును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పసికందును ఆస్పత్రికి తరలించారు. పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో పోలీసులు శిశువును శిశు సంక్షేమ వసతి గృహానికి తరలించారు.