హజ్‌ యాత్రలో 20 లక్షల మంది భక్తులు!

SMTV Desk 2019-08-11 15:30:21  

హజ్‌ యాత్రలో భాగంగా ముస్లింలు సౌదీలోని అరాఫత్‌ కొండను దర్శించుకుంటారు. ఈ కొండ దగ్గరికి లక్షల్లో ముస్లిం భక్తులు వచ్చి మొక్కుకుంటారు. అయితే తాజాగా ఈ యాత్రలో భాగంగా ఇప్పటివరకూ దాదాపు 20 లక్షల మంది ముస్లింలు సౌదీలోని అరాఫత్‌ కొండను దర్శించుకున్నారని సౌదీ అరేబియా ప్రభుత్వం శనివారం తెలిపింది. ఈ యాత్ర సందర్భంగా ఎలాంటి తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. హజ్‌ యాత్రలో భాగంగా భక్తులు తొలుత మక్కాను దర్శించి కాబా చుట్టూ ఏడుసార్లు తిరుగుతారు. మరుసటి రోజూ మినా నుంచి అరాఫత్‌ పర్వతం వద్దకు చేరుకుంటారు. మహమ్మద్‌ ప్రవక్త తన చివరి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఇక్కడి నుంచే అందించారు.