పెట్రోల్ ధర...మరో 10 పైసలు తగ్గింపు!

SMTV Desk 2019-08-06 11:48:41  Petrol, Deseal, Price, New delhi

మంగళవారం(ఆగస్ట్06) నాడు కూడా దేశీయ ఇంధన ధరలు మిశ్రమంగా కదిలాయి. పెట్రోల్ 10 పైసలు తగ్గగా...డీజిల్ మాత్రం నిలకడగా కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.81కు తగ్గింది. డీజిల్ ధర రూ.71.82 వద్ద స్థిరంగా ఉంది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితే ఉంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 9 పైసలు తగ్గుదలతో రూ.76.54కు క్షీణించింది. డీజిల్‌ ధర మాత్రం రూ.71.20 వద్ద స్థిరంగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 9 పైసలు క్షీణతతో రూ.76.17కు తగ్గింది. డీజిల్ ధర స్థిరంగా రూ.70.86 వద్దనే కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 9 పైసలు తగ్గుదలతో రూ.72.28కు క్షీణించింది. డీజిల్ ధర మాత్రం స్థిరంగా రూ.65.94 వద్దనే కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 9 పైసలు క్షీణతతో రూ.77.93కు తగ్గింది. డీజిల్ ధర స్థిరంగా రూ.69.11 వద్ద ఉంది.