కేటీఆర్ పై 6 కేసులు ఉన్నాయి

SMTV Desk 2017-08-30 13:55:52  rail roko case verdict, The case was dismissed, IT Minister KTR

హైదరాబాద్, ఆగస్ట్ 30 : 2011వ సంవత్సరం తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలి దగ్గర రైల్ రోకో నిర్వహించిన మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు సహా 14 మందిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టివేస్తూ రైల్వే కోర్టు తీర్పును ఇచ్చిందని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇంకా తనపై మరో ఆరు కేసులున్నాయని, త్వరలో వాటి నుంచి కూడా బయటపడతామని ధీమా వ్యక్తం చేసారు. కాగా ఈ కేసుకు సంబంధించి గతంలో చాలా సార్లు కేటీఆర్ కోర్టుకు హాజరయ్యారు. దాదాపు ఐదేళ్లపాటు ఈ కేసు విచారణ జరుగగా, వారి వాదోపవాదనలు విన్న న్యాయస్థానం 14 మందిపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. కేసు కొట్టివేతపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.