జమ్ముకశ్మీర్‌ బిల్లులపై కవిత స్పందన

SMTV Desk 2019-08-05 16:24:46  

జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర పునర్విభజన బిల్లు, స్వతంత్ర ప్రతిపత్తి, ఉమ్మడి పౌరసత్వ బిల్లుల రద్దుపై కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని తెరాస మాజీ ఎంపీ కవిత స్వాగతించారు. త్వరలోనే జమ్ముకశ్మీర్‌లో పూర్తి ప్రశాంతత నెలకొంటుందని ఆశిస్తున్నానని, ఆ రాష్ట్ర ప్రజల కోసం భగవంతుని ప్రార్ధిస్తానని కవిత ట్వీట్ చేశారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ఈ బిల్లులకు తెరాస సంపూర్ణ మద్దతు తెలియజేసింది.