విరాట్‌ కోహ్లీ ఎం చెప్పిన మాకు అనవసరం

SMTV Desk 2019-08-01 15:19:43  kohli, gaikwad

కోల్‌కతా: టీమిండియా హెచ్‌ కోచ్‌ ఎంపిక విషయంలో క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) పారదర్శకంగా పని చేస్తుందని ఆ కమిటీ సభ్యుడు అన్షుమన్‌ గైక్వాడ్‌ స్పష్టం చేశాడు. కోచ్‌ ఎంపిక విషయంలో ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సహా ఎవరెవరూ ఏమన్నా అది సీఏసీకి అనవసరమన్నాడు. కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని సీఏసీలో శాంతా రంగస్వామితోపాటు ఒకప్పటి టీమిండియా కోచ్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ కూడా సభ్యుడు. గతంలో మహిళల జట్టు కోచ్‌ను ఎంపిక చేసినప్పుడు ఎన్నో చర్చలు జరిగాయని అన్షుమన్‌ గుర్తు చేశాడు. సీఏసీ ఎవరి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వకుండా డబ్ల్యూవీ రామన్‌ను ఎంపిక చేసిందన్నాడు. తమకు సూచించిన మార్గదర్శకాల ప్రకారమే పని చేస్తామన్నాడు.మేనేజ్‌మెంట్‌, ప్లానింగ్‌, టెక్నికల్‌ అంశాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తి కోచ్‌గా అవసరమని చెప్పాడు.