బోల్డ్ క్యారెక్టర్ తో పెరిగిన క్రేజ్..పారితోషికం పెంచేసిన నభా నటేశ్

SMTV Desk 2019-07-31 14:21:52  nabha natesh

రామ్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ సరసన నాయికలలో ఒకరిగా నభా నటేశ్ నటించింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందాలను ఆరబోసింది. బోల్డ్ గా ఆమె చేసిన ఈ పాత్రతో యూత్ లో క్రేజ్ పెరిగిపోయింది.

ఈ సినిమా హిట్ కావడంతో ఆమె డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. దాంతో నభా నటేశ్ తన పారితోషికాన్ని పెంచేసిందట. ఇస్మార్ట్ శంకర్ కోసం 30 లక్షలు తీసుకున్న ఆమె, ఇప్పుడు 40 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తోన్న డిస్కోరాజా కూడా హిట్ అయితే ఆమె పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.