సిద్ధార్థ అదృశ్యంపై అనుమానాలు

SMTV Desk 2019-07-30 14:40:52  

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ అదృశ్యంపై తనకెన్నో అనుమానాలు ఉన్నాయని కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. సిద్ధార్థ చాలా ధైర్యవంతుడని, అతను ఆత్మహత్య చేసుకుంటాడంటే నమ్మలేనని అన్నారు. సిద్ధార్థ ఉద్యోగులకు 27వ తేదీన లేఖ రాసినట్టు ఉందని, కానీ ఆయన తనతో 28న కూడా మాట్లాడాడని, ఒకసారి కలిసి మిగతా విషయాలు మాట్లాడుదామని అన్నానని, అంతలోనే ఆయన అదృశ్యం కావడం అనుమానాలను పెంచుతోందని అన్నారు. పోలీసులు కేసును సీరియస్ గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ఎం కృష్ణ నివాసానికి వెళ్లిన శివకుమార్, ధైర్యంగా ఉండాలని ఆయన కుటుంబీకులకు చెప్పారు.