ఐఆర్‌సీటీసీ ట్రైన్ బుకింగ్ పూర్తి వివరాలు

SMTV Desk 2019-07-26 15:35:53  

ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఇ-టికెటింగ్ విభాగం ఐఆర్‌సీటీసీలో ట్రైన్ బుకింగ్ గురించి తెలుసు కదా. ఆన్‌లైన్‌లోనే రైల్వే టికెట్లను సులభగా బుకింగ్ చేసుకోవచ్చు. దీనికి చాలా ఆప్షన్లు ఉన్నాయి. అయితే అన్నింటికీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉండాల్సిందే. ✺ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ నుంచి యూజర్లు ఒక నెలలో గరిష్టంగా ఆరు టికెట్లను మాత్రమే బుక్ చేసుకోగరు. ఆధార్ వెరిఫైడ్ యూజర్ 12 టికెట్ల వరకు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ✺ జర్నీకి 120 రోజులు ముందుగానే టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. అన్ని తరగతుల టికెట్లకు ఇది వర్తిస్తుంది. ఇంటర్‌సిటీ డే ట్రైన్స్‌కు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ 60 రోజులుగా ఉండొచ్చు. ✺ ఒకేసారి ఆరు బెర్తులు/సీట్లను బుక్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. జర్నీ దూరం, రైల్వే స్టేషన్స్ ఆధారంగా సీట్ల సంఖ్య మారొచ్చు. ✺ జనరల్, సీనియర్ సిటిజెన్, లేడీస్, తత్కాల్ అనే నాలుగు కోటాల్లో సీట్లను బుక్ చేసుకోవచ్చు. ✺ తదుపరి టికెట్ క్లాస్‌కు ఆటో అప్‌గ్రెడేషన్ సౌలభ్యం ఉంది. ఇది ఆప్షనల్. మీకు అవసరం అనుకుంటే ఎంచుకోవచ్చు. ✺ తత్కాల్ టికెట్ల విషయానికి వస్తే.. ట్రైన్ జర్నీకి ఒక రోజు ముందు మాత్రమే టికెట్లను బుకింగ్ చేసుకోగలం. ఉదాహరణకు ట్రైన్ ఆగస్ట్ 2న స్టేషన్ నుంచి బయలుదేరాల్సి ఉంటే.. ఆగస్ట్ 1న ఉదయం 10 గంటలకు తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమౌతుంది. ✺ చార్ట్ ప్రిపరేషన్‌కు ముందుగానే ఇ-టికెట్లను క్యాన్సల్ చేసుకోగలం. చార్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఆన్‌లైన్ టీడీఆర్ (టికెట్ డిపాజిట్ రిసిప్ట్) మార్గంలో క్యాన్సల్ టికెట్ డబ్బులను రిఫండ్ పొందాల్సి ఉంటుంది. ✺ ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్లను ఎప్పుడైనా ఏ రోజైనా ఆదివారం సహా బుక్ చేసుకోవచ్చు. సీట్లు అందుబాటులో ఉంటేనే బుక్ చేసుకోవగలం.