ఇంగ్లండ్-ఐర్లండ్...రెండో రోజు ఇంగ్లండ్ 9 వికెట్లకు 303 పరుగులు

SMTV Desk 2019-07-26 15:34:41  

లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్- ఐర్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో రెండో రోజు ఆటను నిలిపివేసే సమయానికి ఇంగ్లండ్ 9 వికెట్లకు 303 పరుగులు చేసి కేవలం 181 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉన్నందున ఫలితం తేలే అవకాశాలే ఎక్కువ. తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ జాక్‌ లీచ్‌(92), జాసన్‌ రాయ్‌(72) ఆదుకోవడంతో ఆ మాత్రం స్కోరు సాధించగలిగింది. తక్కినవారిలో జో రూట్‌ 31, శామ్‌ కరన్‌ 37 పరుగులతో పర్వాలేదనిపించారు. రెండో రోజు రెండో రోజు 77.4 ఆట మాత్రమే సాధ్యమైది. వర్షం కారణంగా ఆట నిలిపివేసే సమయానికి ఇంగ్లండ్‌ ఒక్క వికెట్‌ మాత్రమే మిగిలి ఉండగా 303 పరుగులు చేసింది. ఐర్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రెండో రోజు ఆరంభంలోనే ఇంగ్లండ్‌ బర్న్స్‌ వికెట్‌ను కోల్పోయింది. అయితే లీచ్‌, రాయ్‌ రెండో వికెట్‌కు 145 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు పతనాన్ని అడ్డుకున్నారు. రాయ్‌ నిష్క్రమించిన కొద్ది సేపటికే లీచ్‌కూడా పెవిలియన్‌ చేరాడు. ఆతరువాత ఇంగ్లండ్‌ క్రమంగా వికెట్లను కోల్పోయింది. ఆట నిలిపివేసే సమయానికి స్టువర్ట్‌ బ్రాడ్‌ 21, ఒలి స్టోన్‌ పరుగులేమీ చేయకుండా క్రీజ్‌లో నిలిచారు. మార్క్‌ అడైర్‌ 3, రాన్‌కిన్‌, థాంసన్‌ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.