బ్రిటన్ కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్

SMTV Desk 2019-07-24 16:08:33  

బోరిస్ జాన్సన్‌ బ్రిటన్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో లండన్‌ మాజీ మేయర్‌, మాజీ జర్నలిస్టుగా పని చేసిన బోరిస్ ను ప్రధాని పదవికి థెరెసా మే జూన్‌ 7న రాజీనామా చేసిన నేపథ్యంలో.. కన్జర్వేటివ్‌ పార్టీ నేతలు తమ తదుపరి నాయకుడిగా ఎన్నుకున్నారు. పార్టీ నాయకత్వానికి జరిగిన ఎన్నికల్లో బ్రిటన్ కన్సర్వేటీవ్ పార్టీ నేతగా బోరిన్.. ప్రత్యర్ధి జెరెమీ హంట్‌పై ఘన విజయం సాధించారు. 1,59,320 మంది కన్సర్వేటీవ్ పార్టీ సభ్యుల్లో 87 శాతం మంది ఓట్లు వేశారు. అందులో 66శాతం ఓట్లు సాధించిన జాన్సన్ విజయఢంకా మోగించారు. ప్రత్యర్థి జెరెమీ హంట్‌కు 46,656 ఓట్లు దక్కాయి.బ్రెగ్జిట్ డైవోర్స్ డీల్‌పై చర్చలు జరుపుతామని జాన్సన్ ఇప్పటికే వాగ్దానం చేశారు. అయితే ఆయన నేతృత్వంలోని కన్సర్వేటీవ్ పార్టీకి పార్లమెంట్‌లో తగిన మోజారిటీ లేదు. బ్రెగ్జిట్‌ను సమర్ధిస్తున్న ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన డెమొక్రాటిక్ యూనియన్ పార్టీ మద్ధతు అవసరం. ఈ పార్టీకి 10 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వీరంతా మద్దతిచచినప్పటికీ.. ఆధిక్యత స్వల్పమే. మరోవైపు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. వేలాదిమంది నిరసనకారులు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. కాగా.. భారత ప్రధాని మోదీతో తనకున్న వ్యక్తిగత సంబంధాలతో ఇరుదేశాల మధ్య ప్రత్యేకమైన సంబంధాలు ఉండేలా చూస్తానని బోరిస్‌ జాన్సన్‌ కొద్దిరోజుల క్రితం తన పార్టీ సభ్యుల్లోని భారతీయులను ఉద్దేశించి ఒక లేఖ రాశారు.