'జోడి' సినిమా టీజర్

SMTV Desk 2019-07-24 16:07:28  jodi cinema, sai kumar,

ఆది సాయికుమార్ - శ్రద్ధా శ్రీనాథ్ జంటగా జోడి సినిమా నిర్మితమవుతోంది. యువ దర్శకుడు విశ్వనాథ్ రూపొందిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను వదిలారు. నాయకా నాయికల పరిచయం .. ఆ పరిచయం ప్రేమగా మారడం .. ప్రేమికులుగా తమదైన ప్రపంచంలో విహరించడం ఈ టీజర్ లో చూపించారు.కంటెంట్ చూస్తుంటే యూత్ కి కనెక్ట్ అయ్యేలానే వుంది. జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. సాయి వెంకటేశ్ - పద్మజ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, ఫణి కల్యాణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తోన్న ఆది సాయికుమార్ కి, ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి.