వాట్సాప్‌లో నయా ఫీచర్‌

SMTV Desk 2019-07-23 10:53:28  

వాట్సాప్ రాకతో మెస్సేజ్ చేసే పద్దతే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మెస్సేజ్ అంటే టెక్స్ట్ మాత్రమే. కానీ వాట్సాప్ వచ్చిన తరువాత వీడియో, ఆడియో, ఫోటోలను కూడా సులభంగా పంపించుకునే అవకాశం కలిగింది. సాధారణంగా వాట్సాప్‌లో వీడియో, టెక్స్ట్ మెస్సేజెస్ పంపేముందు ఒకసారి పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల తప్పుడు మెస్సేజెస్ పంపే అవకాశం ఉండదు.

కానీ ఆడియో మెస్సేజెస్ పంపే ముందు వాటిని మరోసారి సరిచూసుకునేందుకు అవకాశం ఉండదు. నేరుగా అవతలి వ్యక్తికి చేరుకుంటాయి. ఆ రికార్డింగ్‌లో పొరపాట్లు జరిగితే ఇంకా అంతే సంగతులు. ఆ ఇబ్బందిని తొలగించేందుకు ఇపుడు వాట్సాప్ సంస్థ సన్నద్ధమౌతోంది. ఆడియో రికార్డింగ్‌ మెస్సేజ్ పంపేముందు పరిశీలించుకునే విధంగా యాప్‌లో మార్పులు చేస్తోంది. ఈ ఫీచర్‌ ఐవోఎస్‌లో బీటా దశలో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.