స్టోక్స్‌కు నైట్‌హుడ్‌ హోదా!

SMTV Desk 2019-07-17 12:34:31  knighthood post to ben stokes, ben stoke

ప్రపంచకప్ టోర్నీని సొంతం చేసుకున్న ఇంగ్లాండ్ జట్టులో చివరి వరకు పోరాడి విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌కు నైట్‌హుడ్‌ హోదాను కల్పించనున్నారు. తన మెరుగైన ప్రదర్శనతో స్టోక్స్‌ బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీపడనున్న బోరిస్‌ జాన్సన్‌, జెర్మీ హంట్‌ మనసులను గెలుచుకున్నాడు. వారిరువురూ స్టోక్స్‌కు నైట్‌హుడ్‌ హోదా కల్పించాలని సిఫార్సు చేయనున్నారు. క్రికెట్‌లో అందించిన సేవలకు ప్రతిగా ఇప్పటివరకు 11మంది ఇంగ్లండ్‌ క్రికెటర్లకు నైట్‌హోదా కల్పించారు. చివరిసారిగా మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌కు ఈ గౌరవం దక్కింది. ప్రపంచకప్‌లో స్టోక్స్‌ సేవలను కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌కూడా కొనియాడాడు. అతడు అసాధారణ ఆటగాడని, మానవాతీతుడని పొగిడాడు.