కలకలం సృష్టించిన ప్లాస్టిక్ కోడిగుడ్లు

SMTV Desk 2017-06-03 18:01:02  plastic egg, egg, uttarakhande, haldavani

రాంచీ, జూన్ 3 : ప్లాస్టిక్ కోడి గుడ్ల అంశం కలకలం రేపుతోంది. ప్లాస్టిక్ కోడి గుడ్ల ద్వారా అస్వస్థతకు గురై మరణిస్తారని వెల్లడవడంతో జనం ఆందోళనకు గురౌతున్నారు. బెంగాల్ లో వెలుగుచూసిన ప్లాస్టిక్ కోడిగుడ్ల వ్యవహారం ఇప్పుడు ఉత్తరాఖండ్ లో గగ్గోలు పుట్టిస్తోంది. ఉత్తరాఖండ్ హల్ద్ వానీలో ఒ వ్యక్తి తన ఇంట్లో కోడి గుడ్డును ఉడికించగా ఆ గుడ్డు ప్లాస్టిక్ లా మారిపోయింది. ఈ విషయం ఇరుగు పొరుగు ద్వార దావనలం లా వ్యాపించడం పెద్దఎత్తున గందరగోళానికి దారితీసింది. విషయంపై స్పందించిన స్థానిక అధికారులు వాటిని పరీక్షించి రసాయనాలు ఇత్యాధి ప్రాణాంతకమైనవి ఉన్నాయా అనే విషయమై పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ లో గత కొన్ని రోజుల క్రితం ప్లాస్టిక్ గుడ్లు వ్యవహారం వెలుగుచూసింది.వాటిని తింటే ఆరోగ్యానికి హానికరమని జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా స్పందించారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ గుడ్లు ఉన్నట్లు విచారణ లో తేలలేదని..జనం నిరభ్యంతరంగా గుడ్లను తినవచ్చునని ప్రకటన చేయాల్సి వచ్చింది.