మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు…

SMTV Desk 2019-07-13 11:50:49  rains, hyderabad,

హైదరాబాద్: రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో ఒక మాదిరి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయని, అత్యధికంగా జుక్కల్ లో 90 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని వాతవారణ శాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపుగా 242 ప్రాంతాల్లో వర్షం పడిందని అధికారులు తెలిపారు.