టీడీపీ నేతలు రూ. 400 కోట్లు దొబ్బేశారన్న మంత్రి అనిల్... స్పీకర్, టీడీపీ అభ్యంతరం

SMTV Desk 2019-07-11 14:55:23  

పోలవరం ప్రాజెక్టుకు సర్వ అనుమతులు ఎవరి హయాంలో వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. కేంద్రం నుంచి అనుమతుల తీసుకురావడం దగ్గరి నుంచి కాలువ పనుల వరకూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేడు మంత్రి అనిల్ మాట్లాడారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్ తవ్వించిన కాలువలకే రెండు లిఫ్టులు పెట్టి టీడీపీ నేతలు రూ.400 కోట్లు దొబ్బేశారని వ్యాఖ్యానించారు.

దీంతో దొబ్బేయడం(దొంగిలించడం) అనే పదాన్ని వాడటంపై టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈ ఆన్ పార్లమెంటరీ పదాన్ని వెనక్కు తీసుకోవాలని మంత్రికి సూచించారు. దీంతో చివరికి తన వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి అనిల్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సర్వహక్కులు వైఎస్ కే ఉన్నాయనీ, ఈ ప్రాజెక్టును పూర్తిచేయబోయేది కూడా తామేనని మంత్రి స్పష్టం చేశారు.