టాప్ మల్టీనేషనల్ సంస్థ ఒరాకిల్ లో 5000కొత్త ఉద్యోగాలు

SMTV Desk 2017-08-29 19:47:32  Oracle, Software jobs, MNCs, IT jobs, Apple jobs, amazon jobs

ముంబై, ఆగస్ట్ 29: సాఫ్ట్‌వేర్ దిగ్గజం సంస్థ ఒరాకిల్‌ సాఫ్ట్ వేర్ నిపుణులకు శుభవార్త తెలిపింది. టాప్ సాఫ్ట్‌వేర్ మల్టీనేషనల్ కంపెనీగా పేరు సాధించిన ఒరాకిల్, సేల్స్‌ ఫోర్స్‌ తో తీవ్ర పోటీకి సన్నద్ధమైంది. దానిలో భాగంగా సుమారు 5,000 మంది కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్టు సమాచారం. సాఫ్ట్‌వేర్ రంగంలో తనదైన రీతిలో అభివృద్ధి చెందుతున్న క్లౌడ్ రంగంలో సేల్స్‌ ఫోర్స్‌ ఇంక్‌‌కు గట్టి పోటీ ఇవ్వాలని, ఈ రంగంలో విలువైన మార్కెట్‌ షేరును దక్కించుకోవాలని ఒరాకిల్‌ టార్గెట్‌గా భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీని ప్రభావంతో తొలి త్రైమాసికంలో ఒరాకిల్‌ రెవెన్యూ 58 శాతం పెరగటం గమనార్హం. కాగా, ఇటీవల అమెజాన్.కామ్ ఇంక్ లక్ష మంది సాఫ్ట్‌వేర్ నిపుణులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇదేవిధంగా యాపిల్ సాఫ్ట్‌వేర్ కూడా క్లౌడ్ రంగంలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించింది. దీంతో రానున్న రోజులలో సాఫ్ట్‌వేర్ నిపుణులకు మంచి భవిష్యత్ ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.