రోహిత్‌ క్యాచ్‌ చేజార్చడం వల్లే ఈ ఓటమి!

SMTV Desk 2019-07-03 13:19:43  india vs bangladesh, Mashrafe Mortaza

బర్మింగ్‌హామ్‌: టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఘోరంగా ఓటమిని చవి చూసింది. అయితే ఈ ఓటమిపై తాజాగా ఆ జట్టు కెప్టెన్ మష్రఫె మొర్తజా స్పందించాడు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ... మా ప్రయత్నం బాగుంది. కానీ ఒక్క మంచి భాగస్వామ్యం నమోదైనా పరిస్థితి మరోలా ఉండేది. అదృష్టం కలిసిరాలేదు. పరిస్థితులు అనుకూలించలేదు. షకీబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫిక్‌ రహీమ్‌ అద్భుతంగా ఆడారు. రోహిత్‌ క్యాచ్‌ చేజార్చడం నిరాశను మిగిల్చింది. కానీ మైదానంలో ఇవి సాధారణమే. మా తదుపరి మ్యాచ్‌(పాకిస్తాన్‌తో)కు సర్వశక్తులా పోరాడుతాం. అభిమానుల మద్దుతు అద్భుతం. గెలుపుతో టోర్నీని ముగిస్తాం అని మష్రఫె మొర్తజా ఆశాభావం వ్యక్తం చేశాడు.