అభిమానిని సర్‌ప్రైజ్‌ చేసిన హిట్ మ్యాన్

SMTV Desk 2019-07-03 13:19:04  rohit sharma surprised fan

బర్మింగ్‌హామ్‌: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిన్న బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో ఓ అభిమానిని సర్‌ప్రైజ్‌ చేశాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ సంచలన ఇన్నింగ్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో రోహిత్‌ కొట్టిన ఓ సిక్సర్‌ బంతి ఓ మహిళా అభిమానికి తగిలింది. 104 పరుగులు చేసి పెవిలియన్‌ చేరిన రోహిత్‌.. మైదానం నుంచి వెళ్లేటప్పుడు ఆగి అక్కడున్న అభిమానులను అడిగాడు. తన బంతి ఎవరికి తగిలిందో చెప్పాల్సిందిగా వారిని కోరాడు. మ్యాచ్‌ పూర్తయిన అనంతరం ఆమెను పిలిపించి, మాట్లాడి ఆమె హ్యాట్‌పై సంతకం చేసి ఇచ్చాడు. ఆమెతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. దీంతో ఇవి వైరల్‌ అవుతున్నాయి. రోహిత్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.