హువేయి ట్రయల్స్‌పై స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలి: చైనా

SMTV Desk 2019-06-24 13:38:44  huawei, china, india

బీజింగ్: ప్రముఖ టెక్ కంపనీ హువేయి తన 5జీ ట్రయల్స్‌ను అనుమతించే విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలని భారత్‌ను కోరింది. భారత్‌లో రానున్న వంద రోజుల్లో 5జీ ట్రయల్స్ మొదలు కానున్నాయి. అయితే, హువేయిని నియంత్రించాలా? లేక 5జీ ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతించాలా? అనే విషయంలో భారత్ ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదు. భారత ప్రభుత్వం లేదా ఏదైనా ఇతర దేశం తన స్వంత నెట్‌వర్క్‌లను, డాటాను తన స్వంత ప్రమాణాలు, టెస్ట్ మెకానిజమ్స్, విధానాల ద్వారా రక్షించుకోవడానికి ఒక స్వతంత్ర దృక్పథాన్ని అనుసరించాలి. భయంతో నిషేధం విధించే బదులు సైబర్ సెక్యూరిటి ప్రమాదాలను ఆధారాలు, వాస్తవాధారిత దృక్పథం, తనిఖీలను ప్రవేశపెట్టడం ద్వారా పరిష్కరించుకోవాలి అని చైనాలోని షెంజెన్ కేంద్రంగా పనిచేస్తున్న హువేయి ఇక్కడ ఒక వార్తాసంస్థకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ నెల మొదట్లో 5జీ ట్రయల్స్‌లో పాల్గొనటానికి హువేయిని అనుమతించటంపై భారత్‌కు భద్రతా పరమయిన సమస్యలు ఉన్నాయని అన్నారు.