రక్తహీనత సమస్య పోవాలంటే ?

SMTV Desk 2019-06-12 18:34:28  Raktha Heenatha, anemia,

నేటి తరుణంలో అధిక శాతం మందిని రక్తహీనత సమస్య ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఇందుకు అనేక కారణాలున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల రక్తం చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అయితే రక్తహీనత సమస్య ఉన్నవారు కింద సూచనలు పాటిస్తే దాంతో కేవలం నెల రోజుల్లోనే రక్తాన్ని బాగా పెంచుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. బూడిద గుమ్మడికాయ మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. రోజుకు ఒక కప్పు మోతాదులో బూడిద గుమ్మడికాయ రసాన్ని తాగాలి. ఇలా చేయడం వల్ల రక్తం బాగా పెరుగుతుంది.
2. ఎండు ద్రాక్ష (కిస్‌మిస్) పండ్లను తినడం వల్ల శరీరానికి ఐరన్ బాగా అందుతుంది. ఫలితంగా రక్తం తయారవుతుంది. నిత్యం ఈ పండ్లను తింటుంటే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు.
3. నిత్యం 3, 4 ఖర్జూర పండ్లను
తింటుంటే శరీరానికి ఐరన్ బాగా అంది తద్వారా రక్తం తయారవుతుంది.
4. రాత్రిపూట గుప్పెడు శనగలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని వాటిని తినాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే రక్తం బాగా పెరుగుతుంది.
5. పైన చెప్పినవే కాకుండా, కుంకుమ పువ్వు, అంజీర్ పండ్లు, లేత కొబ్బరి నీరు తీసుకున్నా రక్తం బాగా తయారవుతుంది. అలాగే దానిమ్మ పండు రసంలో గోధుమ గడ్డి చూర్ణం కలిపి రోజూ తాగితే నెల రోజుల్లోనే రక్తం బాగా తయారై రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.