ట్రేడ్‌వార్‌ను ఉద్రిక్తంగా మారుస్తున్న ట్రంప్

SMTV Desk 2019-06-12 18:31:35  china-america trade war

వాషింగ్టన్‌: అమెరికా, చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్దాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరింత ఉద్రిక్తంగా చేస్తున్నాడు. తాజాగా చైనాపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రేడ్‌వార్‌ దెబ్బకు చైనా దేశం అల్లాడిపోతుందని, ఏదో ఒక రకంగా వాణిజ్య ఒప్పందం కదుర్చుకోవాలని చైనా తహతహలాడుతున్నట్లు వ్యాఖ్యానించారు. అమెరికా ప్రభుత్వం ఇటీవల చైనా కంపెనీలపై బిలియన్ల కొద్లీ టారిఫ్‌లు వసూలు చేస్తుండడంతో ఆ కంపెనీలు చైనాను వదిలి అమెరికాకు వస్తున్నాయని ఆయన అన్నారు. దీంతో ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవడానికి చైనా ఉవ్విళ్లూరుతుంది. చైనా వారు టారిఫ్‌ల దెబ్బకు ఇబ్బంది పడి, ఆ కంపెనీలు టారిఫ్‌లను చెల్లించడానికి విముఖత ప్రదర్శిస్తున్నారు. చైనాతో పాత డీల్‌లో నాలుగైదు అభ్యంతరాలున్నాయి. ఐతే పాత డీల్‌ అంగీకరించేవరకు కొత్త డీల్‌పై తనకెలాంటి ఆసక్తి లేదని ట్రంప్‌ శ్వేతసౌధంలో తేల్చి చెప్పారు.